<?xml version="1.0" encoding="UTF-8"?><song><author>John Wesley</author>
<title>ఇంతలోనే కనబడి</title>
<lyrics>[V1]
 ఇంతలోనే కనబడి అంతలోనే మాయమయ్యే
 అల్పమైన దానికా ఆరాటం
 త్రాసు మీద ధూళివంటి ఎత్తలేని నీటివంటి
 స్వల్పమైనదానికా పోరాటం
 కాదు కాదు శాశ్వతం ఏది కాదు నీ సొంతం
 దాటిపోవును ఇల నీ సంపదలన్నియు (2) // ఇంతలోనే //

[V2]
 బంగారు కాసులున్నా అపరంజి మేడలున్నా
 అంతరించిపోయెను భువినేలిన రాజులు (2)
 నాది నాది నాదియంటూ విర్రవీగుచున్నావా
 చచ్చినాక నీది అన్న దేహమైన వచ్చునా // ఇంతలోనే //

[V3]
 మోయలేక బ్రతుకు భారం మూర్చబోయిరెందరో
 ఎదలోని ఆక్రందనలు మారుమ్రోగే లోకంలో (2)
 ఆశ్రయించు యేసుని అనుకూల సమయమున
 చేర్చు నిన్ను మోక్షరాజ్యం నడుపు నిన్ను శాంతితో // ఇంతలోనే //</lyrics>
<hymn_number>38</hymn_number>
</song>